- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Threats: బాంబులతో పేల్చేస్తాం.. ఇండో-పాక్ టెన్షన్ వేళ దేశంలో అగంతకుల కాల్స్
దేశవ్యాప్తంగా బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం వేళ దేశంలో పలు చోట్ల బంబా బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి బాంబు పెదిరింపు కలకలం రేపింది. విమానం బాత్రూంలో బాంబు ఉంది పేల్చివేస్తామంటూ ఆగంతకుల బెదిరింపు కాల్ చేశారు. విమానంలో బంబు బెదిపింపు వ్యవహారాన్ని వెంటనే పైలట్ ఏటీసీకి తెలియజేశారు. దీంతో విమానం హైదరాబాద్ చేరుకోగానే నాలుగు గంటల పాటు తనిఖీలు చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజుల్లో పేల్చేస్తాం:
మరో వైపు రాబోయే రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని కొందరు అగంతకులు ముంబయి పోలీసులకు బెదిరింపు ఈ మెయిల్స్ పంపించారు. మంగళవారం ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్ కు అగంతకుల నుంచి మెయిల్ వచ్చింది. రెండు రోజుల్లో బాంబు బ్లాస్టింగ్ లు జరుగుతాయని ఇందులో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలుపై దర్యాప్తు చేపట్టారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అధికారులు సైతం అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.






