- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు...!
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. మెట్రో స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. ....

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో స్టేషన్(Hyderabad Metro Station)లో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. మెట్రో స్టేషన్‌లో బాంబు(Bomb) పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే బాంబ్ స్వ్కా డ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది(Bomb Squad Personnel) చేరుకుంది. స్టేషన్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అనుమానం వచ్చిన ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలన చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తనిఖీలు చేసింది. ఇరువైపులా రెండు ఫ్లాట్ ఫామ్‌ల్లోనూ సోదాలు చేసింది. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సి అవసరం లేదని తెలిపింది. అయితే బెదిరింపు కాల్ చేసింది ఎవరేనే కోణంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విచారణ చేపట్టింది. నిందితులెవరైనా సరే ఇలాంటి కాల్స్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.






