- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఇవాళ ఉదయం ఎయిర్‌పోర్టు అధికారులకు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానంలో బాంబు పెట్టామంటూ ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. బాంబు తక్షణమే పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు పరిసరాలు, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి యూఎస్‌కు చెందిన జాస్పర్ (Jasper)గా నిర్ధారించారు. తనిఖీల తర్వాత ఎలాంటి ముప్పూ లేదని సెక్యూరిటీ టీమ్ నిర్ధారించింది. ఈ ఒక్క ఏడాదే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కి పైగా బెదిరింపు కాల్స్, మెయిల్ వచ్చినట్లుగా శంషాబాద్ డీసీపీ రాజేశ్ వెల్లడించారు.
కాగా, సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్, లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్, కన్నూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లుగా ఎయిర్‌పోర్టు అధికారులకు ఆగంతకుల నుంచి మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. రన్‌వేపై ఆ మూడు విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అయినప్పటికీ, వాటిని సీఐఎస్‌ఎఫ్ (CISF), బాంబ్ స్క్వాడ్‌లతో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చారు.






