- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Threat: హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం..
వరంగల్ జిల్లా కోర్టుకు (Bomb threat) బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Warangal) వరంగల్ జిల్లా కోర్టుకు (Bomb threat) బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ (Hanmakonda Court) అదాలత్‌లోని జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. బాంబు కలకలంతో న్యాయవాదులు, లాయర్లు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణలో భద్రపరిచిన ఆరు (Detonators) డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డిటోనేటర్లను ఆత్మకూరుకు చెందిన ఓ కేసు విషయంలో గతంలో స్వాధీనం చేసుకున్నవిగా పోలీస్ వర్గాల సమాచారం.
ఈ డిటోనేటర్లకు సంబంధించిన కేసు కూడా గతంలోనే కొట్టి వేసినట్లు పోలీసులు వర్గాల నుంచి సమాచారం. దీంతో తాజాగా బాంబు బెదిరింపు కాల్‌కు ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేనట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకోని.. కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తనిఖీల్లో భాగంగా మరే ఇతర బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






