మంత్రి జూపల్లితో బాలీవుడ్ నటుడు భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli krishna Rao)ను ప్రముఖ బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్(Actor Gagan Malik) నేడు మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి జూపల్లితో బాలీవుడ్ నటుడు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli krishna Rao)ను ప్రముఖ బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్(Actor Gagan Malik) నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. జీటీవీ రామాయణంలో రాముడి పాత్రలో, అలాగే శ్రీలంక నిర్మిత “శ్రీ సిద్ధార్థ గౌతమ” చిత్రంలో గౌతమ బుద్ధుడి పాత్రలలో గగన్ మాలిక్ నటించి ప్రసిద్ధి చెందారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి, గగన్ మాలిక్‌ను బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా వారు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయంగా ప్రచారం చేయడం, బౌద్ధ దేశాలైన శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ వంటి దేశాల నుంచి సందర్శకులను ఆకర్షించడం, బుద్ధవనంలో ఈ దేశాల సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు.

అలాగే, 2025 అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుమారు 100 మంది బౌద్ధ భిక్షువులు కర్ణాటకలోని గుల్బర్గా మీదుగా బుద్ధవనానికి పాదయాత్రగా రానున్నట్లు గగన్ మాలిక్ కు వివరించారు. ఈ పాదయాత్ర బుద్ధవనం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత ఉద్ధృతం చేయనుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Next Story