- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొలెరో పికప్ వాహనం బోల్తా.. మృతి చెందిన మేకలను వదలని ఘనులు
by Sathputhe Rajesh |
మేకల లోడ్‌తో వెళుతున్న బొలెరో పికప్ వాహనం హైవేపై బోల్తాపడడంతో 16 మేకలు మృతి చెందాయి.

X
దిశ, భిక్కనూరు: మేకల లోడ్‌తో వెళుతున్న బొలెరో పికప్ వాహనం హైవేపై బోల్తాపడడంతో 16 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలోని 44 జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని యావత్ మహల్ నుంచి మేకల లోడ్‌తో హైదరాబాదులోని జియాగూడకు వెళ్తున్న బొలెరో వాహనం పెద్ద మల్లారెడ్డి వెళ్లే బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 60 మేకలకు గాను 16 మేకలు మృత్యువాత పడ్డాయి. మిగతా 44 మేకలను మరో వాహనంలో లోడ్ చేసి జియాగూడ మండికి పంపించారు. అయితే మృతి చెందిన 16 మేకలను ఆ దారి గుండా వెళ్లేవారు అపహరించుకుపోయారు. మృతి చెందిన మేకల విలువ రూ.లక్ష 60 వేలు ఉంటుందని డ్రైవర్ తెలిపారు.
Next Story






