Basara: బాసర వద్ద గోదావరిలో బోటింగ్ రద్దు.. నిన్నటి తీవ్ర విషాదం కారణంగా నిర్ణయం!

by Ramesh Naini |

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది (Godavari River)లో బోటింగ్‌లను అధికారులు రద్దు చేశారు.

Basara: బాసర వద్ద గోదావరిలో బోటింగ్ రద్దు.. నిన్నటి తీవ్ర విషాదం కారణంగా నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ జిల్లా బాసర (Basara) వద్ద గోదావరి నది (Godavari River)లో బోటింగ్‌లను అధికారులు రద్దు చేశారు. బాసర వద్ద గోదావరిలో బోటింగ్ (Boating) నిలిపివేయాలంటూ తాజాగా భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో పర్యాటక పడవలపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. నిన్న బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు మృతి చెందడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆదివారం ఉదయం బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందారు.

వీరంతా హైదరాబాద్ చింతల్, దిల్‌సుక్‌నగర్ ఏరియాకు చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలోనే నది సమీపంలో చెట్లు ఏర్పాటుచేసిన ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో స్నానాలు నిషేదించామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ నిన్న మీడియాతో మాట్లాడారు. భద్రతా పరంగా ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని, ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Next Story