- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు...ఆ లేడీ లో-దుస్తులు పెట్టి మరీ !
జనగామ జిల్లాలో ( Jangaon) క్షుద్ర పూజల కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ దుస్తులు... వేసి మరి క్షుద్ర పూజలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జనగామ జిల్లాలో ( Jangaon) క్షుద్ర పూజల కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ దుస్తులు... వేసి మరి క్షుద్ర పూజలు ( black magic ) చేశారు. ఈ సంఘటన ఇప్పుడు... జనగామ జిల్లాలో అందరినీ వణికిస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి గ్రామ శివారు దర్గపల్లి వాగులో ( Darga palli )... క్షుద్ర పూజలు చేశారు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు. అర్ధరాత్రి వాగులో క్షుద్ర పూజలు చేసి రచ్చ చేశారు. వాగులో కూర్చుని ఓ కోడిని బలిచ్చి... పసుపు, కుంకుమ నిమ్మకాయలతో.. క్షుద్ర పూజలు చేశారు.
అయితే ఈ గ్యాంగ్... ఓ లేడీ కి సంబంధించిన లో-దుస్తులు... తీసుకువచ్చి మరి, క్షుద్ర పూజలు చేశారట. ఆ యువతికే చేత బడి చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 11 సమయంలో క్షుద్ర పూజలకు సంబంధించిన శబ్దాలు... అక్కడే ఉన్న రైతులకు వినిపించాయట. దీంతో వాళ్లు అక్కడికి వెళ్లారట. ఇది గమనించిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారని చెబుతున్నారు. అయితే ఆ ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులలో... ఇద్దరు యువకులతో పాటు మరో యువతి ఉన్నట్లు కూడా స్థానికులు స్పష్టం చేస్తున్నారు. పక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారని కూడా చెబుతున్నారు. గత వారం కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్టు కూడా గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ క్షుద్ర పూజలు చేసిన వారు ఎవరనే దానిపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






