- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురునానక్ కాలేజీని ముట్టడించిన బీజేవైఎం
by Sathputhe Rajesh |
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని బీజేవైఎం నాయకులు ముట్టడించారు.

X
దిశ, రంగారెడ్డి బ్యూరో, ఇబ్రహీంపట్నం: అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగింది. అయినప్పటికీ బీజేవైఎం నాయకులు గేట్లు దూకి లోపలికి ప్రవేశించి కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్‌లోకి చొచ్చుకెళ్లి నిరసన తెలిపారు. సుమారుగా 4,000 మంది విద్యార్థులకు మోసం చేసిన గురునానక్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నినాదాలతో హోరేత్తించారు. పోలీసులకు, బీజేవైఎం నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story






