Telangana టార్గెట్‌గా బీజేపీ పోరాటం :Tarun Chugh

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-30 06:57:47  IST  )

తెలంగాణలో బీజేపీ పోరాటం సాగుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు.

Telangana టార్గెట్‌గా బీజేపీ పోరాటం :Tarun Chugh
X

దిశ, వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పోరాటం సాగుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అహంకారం, అవినీతి నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమన్నారు. బీజేపీ తెలంగాణలో వేగంగా బలపడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై ఆగ్రహాంతో ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read...

సునీల్ కనుగోలు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

Next Story