Delhi Drinking Water : ఢిల్లీ తాగునీటీ విషంపై కేజ్రీవాల్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-28 08:54:09  IST  )

ఢిల్లీ(Delhi)నగరానికి సరఫరా చేసే తాగునీటీలో విషం కలిపార(Poison in Drinking Water)ని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal)బీజేపీ(BJP) పై చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. అయితే బీజేపీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Delhi Drinking Water : ఢిల్లీ తాగునీటీ విషంపై కేజ్రీవాల్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi)నగరానికి సరఫరా చేసే తాగునీటీలో విషం కలిపార(Poison in Drinking Water)ని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal)బీజేపీ(BJP) పై చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. అయితే బీజేపీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా ఆప్, బీజేపీలు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం పరస్పర ఆరోపణలు, విమర్శలతో తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ డేంజర్ లో ఉందని. హర్యానా నుంచి నగరానికి సరఫరా చేసే తాగు నీటిలో విషం కలుపుతున్నారని..ఇదంతా బీజేపీ పనేనని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీలో గందరగోళం సృష్టించే ప్రయత్నంలో నగరానికి వస్తున్న నీటిలో విషయం కలిపారని.. చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని పని బీజేపీ చేసిందని విమర్శించారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రమైన హర్యానాలో అధికారంలో ఉన్న ఆ పార్టీ...యమునా నదిలో విషపూరితమైన పదార్ధాలను కలిపిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా, ఉత్తరప్రదేశ్ ల నుంచి తాగునీరు అందుతుందని...అయితే హర్యానా ప్రభుత్వం యమునా నది నుంచి ఢిల్లీకి వచ్చే నీటిలో అమ్మోనియా అనే విష పదార్ధం కలిపి ఇక్కడికి పంపిందన్నారు. అందుకే యమునా నదిలో అమ్మోనియా స్థాయిలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు.

దీనిని తాము ముందే గుర్తించామని...అందుకే ఈ నీటిని నిలిపివేసినట్లు జల్ నిఘా బోర్డు ఇంజనీర్లు తెలిపారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే విషతుల్యమైన నీటి సరఫరాను ఆపేశామని చెప్పారు. ఇలాంటి చర్యలు పూర్వం యుద్ధాల సమయంలో చేసేవారని.. కానీ బీజేపీ ఇప్పుడు చేస్తోందని. విషపూరితమైన నీటి ద్వారా ఢిల్లీలో గందరగోళం సృష్టించి...ఆ తప్పును తమ ప్రభుత్వం మీద వేయాలని బీజేపీ చూసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అటు సీఎం అతిషీ కూడా దీనిపై మాట్లాడుతూ యమునను కలుషితం చేయడం జల ఉగ్రవాదమన్నారు.

బీజేపీ స్ట్రాంగ్ రిప్లై(BJP's Strong Repl)

ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలిపిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీకే చెందిన హర్యానా సీఎం నయాబ్ సైనీ(Haryana CM Nayab Saini) తీవ్రంగా ఖండించారు. చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఫ్యాక్టరీ అని.. యమునా నది ఢిల్లీలోకి ప్రవేశించే సోనిపత్ ప్రదేశానికి జర్నలిస్టులను, నిపుణులను తీసుకెళ్లి నీటి నాణ్యతను తనిఖీ చేయండి అని సవాల్ చేశారు. అలాగే ఢిల్లీలో నదిలో నీటిని కూడా పరిశీలించమని..ఢిల్లీలో నదిని శుభ్రం చేయడం మా పని కాదని..ఆ పని కేజ్రీవాల్ చేయలేకపోయాడని విమర్శించారు. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు గుణపాఠం తప్పదన్నారు.కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా ప్రభుత్వం దావా వేస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Next Story