caste census: మోడీతో మోహన్ భగవత్ భేటీ తర్వాత కులగణనపై సంచలన నిర్ణయం.. ప్రతిపక్షాలపై బీజేపీ ఖతర్నాక్ ప్లాన్?

by Prasad Jukanti |   (  Updated:2025-04-30 15:31:27  IST  )

ప్రతిపక్షాలపై బీజేపీ ఖతర్నాక్ ప్లాన్ చేసిందా?

caste census: మోడీతో మోహన్ భగవత్ భేటీ తర్వాత కులగణనపై సంచలన నిర్ణయం.. ప్రతిపక్షాలపై బీజేపీ ఖతర్నాక్ ప్లాన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా కులగణనపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన (Caste Census) నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షత రాజకీయ వ్యవహారాల కమిటీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో (Modi) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) భేటీ అయ్యారు. ఈ ఇరువురు భేటీ అయిన మరుసటి రోజే కులగణనపై కేంద్ర కేబినెట్ ఈనిర్ణయం తీసుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజానికి మోడీ, మోహన్ భగవత్ భేటీ విషయంలో వేరే ప్రచారం జోరుగా వినిపించింది. పహెల్గాం దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం పై ఇరువురు కీలకంగా చర్చించినట్లు ప్రచారం సాగినా ఇవాళ కేబినెట్ భేటీలో పాక్ పై తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎటువంటి అంశం బయటకు రాలేదు. కానీ కులగణన అంశం తెరపైకి రావడంతో వీరి భేటీ ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యతగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలపై అస్త్రం:

తెలంగాణలో కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం, త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీపై కులగణన అంశాన్ని ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామని రాహుల్‌గాంధీ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో ఇన్నాళ్లు మౌనం వహిస్తూ వచ్చిన బీజేపీ అనూహ్యంగా కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేశ రాజకీయాల్లో బిగ్ పొలిటికల్ స్ట్రోక్‌గా మారబోతున్నదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

రాహుల్ గాంధీకి చెక్:

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేయించి ఆ లెక్కలు బయటపెట్టింది. ఇదే మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని రాహుల్ ప్రచారం చేస్తున్నారు. కులగణన విషయంతోనే బీజేపీని కార్నర్ చేయాలని ఆయన ప్రణాళికలకు పదును పెడుతున్నారు. నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ కులగణన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ దేశంలో కులగణనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని అందుకే మోడీ ప్రభుత్వం కులగణన చేయడం లేదని రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ ప్రణాళికతో పాటు కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా నిలువరించేలా కేంద్రం ఈ బిగ్ స్టెప్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ (Congress) పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై బీజేపీ ప్రయోగించిన అస్త్రం అనే చర్చ జరుగుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read Also..

PM Modi: ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు

Next Story