- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత విద్వేషాలతో లబ్ధి పొందాలని బీజేపీ పన్నాగం.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఫైర్
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. అసలు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) ఏం మాట్లాడుతున్నాడో.. ఆయనకైనా అర్థం అవుతోందా అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ (BJP)ని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక మిత్ర పక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కోదండరాం పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. నిస్వార్ధంగా, నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు అన్ని విషయాలు తెలిసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక రూప కల్పనలో కోదండరాం సలహాలు సూచనలు విలువైనవని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక్లో కోదండరాం మద్దతను తాము కోరుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ స్పష్టం చేశారు.






