బీజేపీ హ్యాట్రిక్ ఖాయం.. వచ్చే సీట్లు ఎన్నంటే?

by Disha Web Desk 4 |
బీజేపీ హ్యాట్రిక్ ఖాయం.. వచ్చే సీట్లు ఎన్నంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేదని, హ్యాట్రిక్ ఖాయమని టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చింది. ఈ సర్వేలో దేశం నలుమూలల నుంచి 90వేల మంది పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. సర్వే ప్రకారం ప్రతిపక్షాలన్నీ ఏకమైనా బీజేపీపై అంతంత మాత్రమే ప్రభావం చూపుతాయని వెల్లడైంది. ఇదే సమయంలో మోడీ 2.0 ప్రభుత్వం పనితీరుపై 51 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 292 నుంచి 338 సీట్లు సాధించే అవకశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపి 106 నుంచి 144, టీఎంసీ 20 నుంచి 22, వైస్సాఆర్ సీపీ 24 నుంచి 25, బీజేడీ 11 నుంచి 13 నియోజకవర్గాల్లో గెలవనున్నాయని తెలిపింది. ఇతరులు 50 నుంచి 80 స్థానాల్లో గెలుపొందనున్నారని వెల్లడించింది.

Next Story

Most Viewed