- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ డీలిమిటేషన్నాటకం: మంత్రి వివేక్వెంకటస్వామి
రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం డీలిమిటేషన్ నాటకం ఆడుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ భారతదేశంలో ఓటమి చవిచూస్తున్న బీజేపీ డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అసోంలో చేసిన విధానాలను ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పునరావృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, బీజేపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులను మార్చేందుకు కృషి జరుగుతోందన్నారు. గతంలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియలు జరిగినప్పటికీ, అప్పట్లో ఇంతటి స్థాయిలో అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంపై పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లోతుగా అధ్యయనం చేసి సమతుల్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించారని తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను సమతుల్యంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.






