HYD: గాంధీ విగ్రహానికి 100 ఎకరాలు కావాలా?

by Gantepaka Srikanth |

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

HYD: గాంధీ విగ్రహానికి 100 ఎకరాలు కావాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదు. మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు ఇది. హైదరాబాద్‌ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం. అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వండి”. అని ముఖ్యమంత్రి కోరారు.

అంతేగాకుండా.. గాంధీ విగ్రహం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గాంధీ విగ్రహం కోసం దాదాపు రూ.75 కోట్లకు మించి ఖర్చు చేయడం లేదు. మొత్తం మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.6500 నుంచి 7 వేల కోట్లకు మించి ఖర్చు చేయడం లేదు. ఇది కోట్లాది మంది నగర ప్రజల భవిష్యత్తు. ప్రపంచంతో పోటీపడే విధంగా హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకుందాం సహకరించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదు..

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం అంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదు. గాంధీ విగ్రహానికి 100 ఎకరాలు కూడా అవసరం లేదు. మేము గుజరాత్‌లో ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది కలుగకుండా సబర్మతీ ప్రాజెక్టు పూర్తి చేశాం’ అని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Next Story