- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంపై సీఎం రేవంత్ మొండి వైఖరి వీడాలి : బీజేపీ చీఫ్ రామచందర్ రావు లేఖ
కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీలను పునరుద్ధరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో దుయ్యబట్టారు. NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. NDSA ఇచ్చిన నివేదికను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చని రామచందర్ రావు తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కనపెట్టి.. ప్రజల కోసం కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తీసుకురావాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని, కరువు కాలంలో గోదావరి నీటిని వాడుకోలేక నష్టపోతున్నామని వాపోయారు. NDSA నివేదికల అమలులో అలసత్వం చేస్తున్నారని, కేంద్ర కమిటీపై నెపాన్ని నెట్టి తప్పించుకోవద్దని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను త్వరలో పునరుద్ధరించాలని కోరారు.






