- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: చతికిలపడ్డ బీజేపీ.. డ్యామేజ్‌కు కారణం ఇదే!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయింది. 2023లో అత్యధిక ఓట్లను సాధించినా.. ప్రస్తుతం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. జూబ్లీహిల్స్సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. 2014 నుంచి ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థే గెలిచారు. ఒకసారి బండారు దత్తాత్రేయ, మరో రెండుసార్లు ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలిచారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇంతవరకు అంతగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అంటే పార్లమెంట్ ఎన్నికల మీదే పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని, మిగిలిన ఎన్నికలను అంతగా పట్టించుకోదనే విమర్శలు పార్టీ కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. అందరికంటే చివరగా అభ్యర్థిని ప్రకటించడం, అదికూడా బలహీనమైన అభ్యర్థిని బరిలో దింపారని, బీఆర్‌ఎస్‌తో అంతర్గత ఒప్పందం కుదిరిందా? అనే అనుమానాలను సైతం వ్యక్తం అయ్యాయి.
అంతా ఆయనే చూసుకుంటారు..
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు కావడంతో పార్టీలోని ఇతర ప్రముఖులు ఎవరూ కూడా దీనిపై అంతగా దృష్టి పెట్టలేదు. అంతా ఆయనే చూసుకుంటారనే ధోరణి కనిపించింది. ఆయన సీనియర్ నేత, ఆయనకు చెప్పేవాళ్లమా..? అంటూ మిగితా నిట్టుర్చారు. పార్టీ ప్రచారం చేయమని ఆదేశించిన చోటే పని చేశారు. బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తదితర నేతలను ప్రచారంలో పెద్దగా భాగస్వాములను చేయలేదు. కిషన్‌రెడ్డి అంత దూకుడుగా వ్యవహరించారని, దీటుగా సమాధానం ఇవ్వరనే పేరు ఉంది. దీంతో బీజేపీ పోటీలో ఉన్నదా? అన్నట్లుగా ప్రచారం సాగింది.
అధ్యక్షుడి ఎంపిక మొదలు అన్నీ..
అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌కు వచ్చేసరికి బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరగడం, ఆఖరికి అధ్యక్షుడిగా రాంచందర్‌రావు పేరు ప్రకటనతో పార్టీ కేడర్ డీలా పడింది. దూకుడుగా, దీటుగా వ్యవహరించే నాయకులను కాకుండా విధేయుడనే ఒకే ఒక్క కారణంతో ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు అంతర్గతంగా ఖరారు అయిందని, అందుకే కేంద్ర నాయకత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని టాక్ వినిపించింది. మొత్తంగా అంతర్గత కలహాలు, సమన్వయం లేమితో కమలం పార్టీ జూబ్లీహిల్స్‌లో చతికిలపడింది.
నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీజేపీకి వచ్చిన ఓట్లు..






