- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర బడ్జెట్ తెలంగాణకు గర్వకారణం : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ‘వికసిత్ భారత్’ నిర్మాణ సంకల్పం ఇక ఆశయంగా మాత్రమే కాకుండా, వాస్తవంగా మారే దిశగా దేశాన్ని దృఢంగా ముందుకు నడిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ‘వికసిత్ భారత్’ నిర్మాణ సంకల్పం ఇక ఆశయంగా మాత్రమే కాకుండా, వాస్తవంగా మారే దిశగా దేశాన్ని దృఢంగా ముందుకు నడిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ గర్వకారణమని, హైదరాబాద్‌కు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనతో రాష్ట్రం జాతీయ వృద్ధి యంత్రంగా మరింత బలపడనుందని అన్నారు. ఇది మార్పును తీసుకొచ్చే బడ్జెట్ అని, ఆర్థిక బలం నుంచి జాతీయ సామర్థ్యానికి, అంత్యోదయం నుంచి అభ్యుదయానికి దేశాన్ని నడిపించే స్వర్ణ యాత్రకు పునాది వేస్తోందని చెప్పారు. పచ్చని పొలాలు, బలమైన ధాన్యాగారాలు, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండేలా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో రూపొందిన ఈ బడ్జెట్ దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతో పాటు, ఇంధన భద్రతను బలోపేతం చేస్తోందని, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక సంస్కరణలను తీసుకొస్తోందన్నారు. ఉపాధి సృష్టి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కొనుగోలు శక్తి వృద్ధి, నాణ్యమైన విద్య-వైద్య సేవల విస్తరణకు ఈ బడ్జెట్ బలమైన పునాదిని వేస్తోందన్నారు. ఈ నిరంతర విధానాల ఫలితంగా భారతదేశం సుమారు 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని, పేదరికం తగ్గింపులో చారిత్రాత్మక పురోగతి సాధించిందని తెలిపారు. పేదల సంక్షేమం, రైతుల సౌభాగ్యం, మహిళల సాధికారత, యువత ఆశయాల సాధనకు అనుగుణంగా ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల సమావేశం :
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం తో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలు, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్నికల ఇన్‌చార్జ్ అశీష్ షెలార్ , రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్నికల కో-ఇన్‌చార్జ్ అశోక్ పర్ణామితో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులు, డివిజన్లకు అంచనాల కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా రెబల్ అభ్యర్థులు ఉంటే ఇంచార్జీలు వారితో మంతనాలు జరిపి ఉపసంహరణ చేసుకునేలా చూడాలని ఆదేశించారు. 200 మంది ఓటర్లకు ఒక బాధ్యుని నియమించి నిత్యం వారిని కలిసే విధంగా ప్రచారం చేపట్టాలి. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఫించన్లు, మహిళలకు రూ. 15 వేలు పథకాలు ఇవ్వకుండా తప్పించుకుందని వాడవాడలా తిరిగి వివరించాలని సూచనలు చేశారు.






