పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్‌ సీరియస్‌ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ లేఖ

by Ramesh Naini |

పార్టీలో ఉంటూ హైకమాండ్​ నిర్ణయాలు దిక్కరించి మాట్లాడితే వేటు తప్పదని పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్‌ రామచందర్‌రావు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు.

పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్‌ సీరియస్‌ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీలో ఉంటూ హైకమాండ్​ నిర్ణయాలు దిక్కరించి మాట్లాడితే వేటు తప్పదని పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్‌ రామ్‌చందర్‌ రావు (Ramchander Rao) సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. టికెట్ల పంపిణీ హస్తిన పెద్దలు చూసుకుంటారని ఇష్టానుసారంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేయవద్దని రామ్‌చందర్‌ రావు హెచ్చరించారు. ఆదివారం ఆయన దిక్కరించే నేతలకు లేఖ పంపారు. పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటూ లేఖలో పేర్కొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సొంత అజెండాతో మాట్లాడొద్దు అంటూ ఘాటుగా స్పందించారు. హైకమాండ్​ఏ నిర్ణయం తీసుకున్న అందరూ కట్టుబడి ఉండాలని, ఉప ఎన్నికల్లో కొత్త నాయకులు పేర్లు ప్రచారం చేసినట్లు తమ దృష్టికి వస్తే వేటు తప్పదన్నారు. స్ధానిక ఎన్నికలను రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, అభ్యర్ధుల ఎంపిక కు సంబంధించినవి ఆయా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు చూసుకుంటారని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు తానే గొప్పని చెప్పడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర కమిటీకి చెప్పకుండా పార్టీ గురించి, పార్టీ నేతల గురించి విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు.

Next Story