ఎంపీ ఎవరైతే బాగుంటుంది? అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పెషల్ ఫోకస్

by Disha Web Desk 14 |
ఎంపీ ఎవరైతే బాగుంటుంది? అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పెషల్ ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు సిద్దమైనాయి. మెజారిటీ గెలుపే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీలు కార్యాచరణ మొదలు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నిక్లలో చేసిన తప్పులు లోక్‌సభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా నిమగ్నమైంది. ఈ క్రమంలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయలనుకుంది.

నేడు, రేపు ఈ భేటీలు జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల్లో మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలకు ఆహ్వానం అందినట్లు తెలిసింది. పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అయితే బాగుంటుంది? అనే అంశం పై అభిప్రాయ సేకరణ రాష్ట్ర నేతలు చేయనున్నారు. పార్లమెంట్ వారీగా అభిప్రాయ సేకరణకు రాష్ట్ర పదాధికరుల తో టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణకు నేడు నేతలు వెళ్లినట్లు సమాచారం.

Next Story