- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడు కిరాణ షాపుల్లో ఇప్పుడు స్క్రాప్ దుకాణాల్లో.. కేసీఆర్, రేవంత్ పాలనపై బీజేపీ సెటైర్లు
by Prasad Jukanti |
కేసీఆర్, రేవంత్ రెడ్డి పరిపాలనపై తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భావి పౌరుల భవిష్యత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇటీవల ఓ పాత సామాన్ల దుకాణంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు దర్శనం ఇవ్వడంపై బీజేపీ మంగళవారం ఎక్స్ వేదికగా రియాక్ట్ అయింది. కేసీఆర్ ఏలుబడిలో కిరాణ షాపుల్లో పదో తరగతి పరీక్ష పత్రాలు లభ్యం అయితే రేవంత్ రెడ్డి పాలనలో స్క్రాప్ దుకాణంలో పాఠ్యపుస్తకాలు కనిపిస్తున్నాయని దుయ్యబట్టింది. ఈ ఇరు పార్టీల ప్రభుత్వాలలో భావితరం భవిష్యత్ అంగట్లో సరుకుగా మారిపోయిందని విమర్శించింది
Next Story






