ప్రజలతో కలిసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం!

by Anjali |
ప్రజలతో కలిసి  బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలతో కలిసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం చేపట్టబోతున్నట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు. ఆశలు తీరుస్తారని అధికారం ఇస్తే దోపిడీకి లైసెన్స్‌గా మార్చుకుంది వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. వైసీపీ నేతలు ఎక్కడ చూసినా దోపిడీనేనని అన్నారు. పంచభూతాల్లో దేన్నీ వదల్లేదు అని ధ్వజమెత్తారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరిదీ దోపీడీ ఎజెండానేని విరుచుకుపడ్డారు. ఓ వైపు ఓటు బ్యాంక్ కోసం మత రాజకీయాలు.. మరో వైపు కక్ష సాధింపులేనని ధ్వజమెత్తారు. పథకాల పేరుతో ప్రజల్ని సోమరుల్ని చేసి యువశక్తి నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

సహజ సంపదను సొంతానికి రాసుకున్న దారుణాలు ఎన్నో ఉన్నాయనివిరుచుకుపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యలు చేస్తున్నారని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకమయ్యాయని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ హామీలు ప్రజల కళ్లముందు ఉంచి వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి నిర్వాకాన్ని ప్రజల ముందు చార్జిషీట్ల రూపంలో ఉంచబోతున్నామని తెలిపారు. వైసీపీ నేతలు చేసిన తప్పులను అధికారులకు ఫిర్యాదులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచే బీజేపీ చార్జిషీట్ల ఉద్యమం చేపట్టబోతున్నామని... ప్రజలతో కలిసి.. ప్రభుత్వానికి బుద్ది చెప్పబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు.

Read More: ‘దర్యాప్తు జరుగుతోంది.. చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరు’

Next Story