స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

స్థానిక ఎన్నికలు(Local Body Elections) సమీస్తోన్న వేళ బీసీలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక హామీ ఇచ్చారు.

స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికలు(Local Body Elections) సమీస్తోన్న వేళ బీసీలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని మాటిచ్చారు. 45 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తామని కీలక హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నామని.. అందులో భాగంగానే ఆగస్టు 2న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నాకు ప్లాన్ చేశామని.. ఈ ధర్నాలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ కసరత్తు ప్రారంభించారు. సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాని హైకోర్టు తీర్పుతో ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. అలాగే ఈ సారి ఎన్నికల్లో పోటీకి యువత ఆసక్తి కనబరుస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ దఫా కొత్త తరం నాయకులు ఎన్నికల్లో నిలబడి గెలచి తమ రాజకీయ భవిష్యత్‌కు పునాది వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Next Story