తెలంగాణకు మోడీ ఏమీ చేయలేదంటారా?.. హరీశ్‌రావు వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఫైర్

by Ramesh Naini |

తెలంగాణకు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించిన వారి మాటలను తిప్పికొట్టాలని తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందించింది.

తెలంగాణకు మోడీ ఏమీ చేయలేదంటారా?.. హరీశ్‌రావు వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించిన వారి మాటలను తిప్పికొట్టాలని తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవల గెలిచిన సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆదివారం పోస్ట్ చేసింది. ఆ వీడియోలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ‘నేను మా సర్పంచ్‌లను కోరేది ఒక్కటే.. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 85 శాతం ఢిల్లీ నుంచి నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గానీ, మంత్రులు గానీ ఆపలేరు. ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్‌గా సర్పంచ్‌ల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తెలంగాణ బీజేపీ ట్వీట్‌ చేస్తూ.. ‘పన్నెండు ఏండ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు చేసింది ఏమి లేదు అని అన్న వారి పన్లు రాలగొట్టండి, అధికారం పోయినంక, అంధకారం నుంచి బయటికి వచ్చి తన్నీరు హరీశ్‌రావు అనిన ఈ మాట ఇన్నేండ్ల నుంచి తప్పు అన్న వాడిని, ఇక ముందు అనేవాడిని పట్టుకుని తన్నుర్రి, గ్రామీణాభివృద్ధికి గరిష్ట శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే కల్పించింది అని పదే పదే బీజేపీ నాయకులు చెప్పినా.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టిన కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకులకు ఆ ప్రజలే బుద్ధి చెప్తారు.’ అని ట్వీట్‌లో పేర్కొంది. ట్వీట్ ఇదే..

Next Story