- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీలో వక్ఫ్ ఆస్తులను CM బహిర్గతం చేయాలి: బీజేపీ MP డిమాండ్
వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు కావాలనే వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న వక్ఫ్ ఆస్తులను(Waqf Properties) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్టంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. వక్ఫ్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు.
పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారని అన్నారు. పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పేద ముస్లింల అభ్యున్నతిని అడ్డుకోవడానికే వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న స్థలాలు, ఆస్తుల బండారం బయటపడుతుందనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కొల్లగొట్టిన వారంతా ఏకమై.. ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనల సాకారానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు.






