- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై బీజేపీ MP సోయం బాపురావు క్లారిటీ
by Satheesh |
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ రియాక్ట్ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు రియాక్ట్ అయ్యారు. నాపై అర్థం లేని ఆరోపణలు వస్తున్నాయన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇందులో నిజం లేదన్నారు. ఈ నెల 27న తన కుమారుడి వివాహం ఉందని, శుభలేఖలు ఇచ్చేందుకే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని ఇందులో భాగంగా కేసీఆర్, రేవంత్ రెడ్డిలను కలిశానన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక బీఆర్ఎస్ ఉందని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ ఓడినా ఓట్ల శాతం తగ్గలేదని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినంత మాత్రాన దేశమంతటా గెలిచినట్లు కాదన్నారు. మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిందే తానేనని.. ఆయనతో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
Next Story






