త్వరలో కేంద్రమంత్రికి బనకచర్లపై వివరిస్తాం : ఎంపీ రఘనందన్​రావు

by velandi.Saikiran |   (  Updated:2025-06-18 16:53:45  IST  )

రాష్ట్రానికి అన్యాయం జరిగే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోమని, బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను

త్వరలో కేంద్రమంత్రికి బనకచర్లపై వివరిస్తాం : ఎంపీ రఘనందన్​రావు
X

తెలంగాణకు అన్యాయం జరగనివ్వం

త్వరలో కేంద్రమంత్రికి బనకచర్లపై వివరిస్తాం : ఎంపీ రఘనందన్​రావు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి అన్యాయం జరిగే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోమని, బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని ఎంపీ రఘనందన్​రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏమిటి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రాజెక్ట్ ఆపేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలిపారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆధ్వర్యంలో ఆఖిల పక్ష పార్టీల ఎంపీలతో సమావేశం జరిగినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఎంపీ డి కె అరుణతో కలిసి మాట్లాడుతూ ఏపి ప్రభుత్వం నిబంధనలకు వైరుద్దంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు. మున్ముందు తాము కూడా ఎంపీలుగా కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరిస్తామన్నారు. గోదావ‌రి న‌దిలో తెలంగాణ‌ వాటానీటి కేటాయింపుల్లో ఏంత మేర వాడుకున్నాం,

న‌దిపై పూర్తికావాల్సిన ప్రాజెక్టులెన్ని ఎందుకు వాటిని పూర్తి చేయలేక‌పోయారనే అంశాలపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయ‌త్నం ఎందుకు చేయ‌లేదనే విషయాలపై వివరాలు అడిగినట్లు తెలిపారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కలిసి వివరించినట్లు వెల్లడించారు.

Next Story