‘అక్కడ ఏ గద్ద వాలిందో.. ఎన్ని సూట్‌ కేసులు ఎత్తుకెళ్లిందో అన్నీ బయటపెడుతా’: MP రఘునందన్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

గండిపేట మండలం నార్సింగి దగ్గర శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు(Aditya Vintage Project) వైపు అందరి దృష్టి పడింది.

‘అక్కడ ఏ గద్ద వాలిందో.. ఎన్ని సూట్‌ కేసులు ఎత్తుకెళ్లిందో అన్నీ బయటపెడుతా’: MP రఘునందన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గండిపేట మండలం నార్సింగి దగ్గర శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు(Aditya Vintage Project) వైపు అందరి దృష్టి పడింది. ఇప్పుడది అక్రమమా? సక్రమమా? ఏదో ఒకటి తేల్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మూసీ జపం చేస్తోంది. ప్రజలు ఒకటి కోరుకుంటే.. ప్రభుత్వం మరొకటి చేస్తోంది. అభివృద్ధి పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూలుస్తోంది. నార్సింగిలో అక్రమ నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. ఆదిత్య వింటేజ్ బంగ్లాను పూర్తిగా మూసీ పరివాహకంలో నిర్మిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదిత్య వింటేజ్ బంగ్లా నిర్మాణం నిలివేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీసుకెళ్లాలి. సర్వీస్ రోడ్డు ఆక్రమించి కట్టే భవనానికి హెచ్‌ఎండీఏ ఎలా అనుమతి ఇచ్చింది. ఇది పూర్తిగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మిస్తున్నారు. ఆదిత్య వింటేజ్ బంగ్లా నిర్మాణాలపై సీఎం రేవంత్‌తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు లేఖ రాస్తున్నాను.. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు పోతా.. కోర్టులో ఆదిత్య వింటేజ్ బంగ్లాపై ఏ గద్ద వాలిందో.. ఎన్ని సూట్‌ కేసులు ఎత్తుకెళ్లిందో అక్కడే తేల్చుతా’’ అని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story