స్థానిక ఎన్నికల ఎఫెక్ట్: బీజేపీ శ్రేణులకు రఘునందన్ రావు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) వేళ తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎన్నికల ఎఫెక్ట్: బీజేపీ శ్రేణులకు రఘునందన్ రావు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) వేళ తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్నీ బీజేపీ అభ్యర్థులే గెలవాలని అన్నారు. మూడు నెలలకు సరిపడా మోడీ సర్కార్ రేషన్ బియ్యం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రీజనల్ రింగ్ రోడ్‌కు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు చెప్పారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

Next Story