- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మలేషియాలోని (Kuala Lumpur) కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) అధ్యక్షుడు చొప్పరి సత్య, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీదాస్యం, ట్రెజరర్ సునీల్ కుమార్, అలాగే BAM కోర్ కమిటీ సభ్యులు ఎంపీ ఈటల రాజేందర్‌కి ఘన స్వాగతం పలికారు.
ఈ మేరకు BAM ప్రతినిధులు మాట్లాడుతూ.. మన దసరా, బతుకమ్మ, దీపావళి మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈటల రాజేందర్ రాకతో ఈ వేడుక మరింత వైభవంగా సాగనుందని తెలిపారు. ఆయన కుటుంబం హాజరు కావడం మనందరికీ మరింత ఆనందాన్నిచ్చింది అని వెల్లడించారు. ఇవాళ, రేపు ఆయన మలేషియాలోనే ఉండి అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం.
Next Story






