- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Laxman: ఒవైసీని జైల్లో వేసే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌కు ఉందా?
రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసే పర్యటన అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసే పర్యటన అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. మోడీ అంటే మోడల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అని, దేశ ప్రజలు తమ తీర్పుతో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని పదే పదే నిరూపిస్తున్నారని అన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కమలం జెండా రెపరెపలాడుతున్న వేళ, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ వికాస్, విశ్వాస్, విరాసత్’ అనే నినాదాలతో ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ను ఆచరణలో చూపిస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండి కూటమికి ఎటువంటి అజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ , మజ్లిస్పార్టీల పేర్లు వేరైనా వారి విధానాలు ఒకటేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని మెప్పించుకోవడానికి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అనే స్థాయికి దిగజారి అనుముల రేవంత రెడ్డిగా మారుతున్నారని ఆరోపించారు. ఆయన హేట్ స్పీచ్ చట్టం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ధైర్యముంటే హిందువులపై విమర్శలు చేసే ఓవైసీని జైల్లో వేయాలని సవాల్ విసిరారు.
తెలంగాణకు ఎయిమ్స్, రామగుండం ఎరువుల కర్మాగారం, జాతీయ రహదారులు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు, కొత్తగా హైస్పీడ్ రైళ్లు వంటి వేల కోట్ల అభివృద్ధిని ప్రధాని మోడీ అందించారని వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే పార్టీలకు అతీతంగా ఆయన పర్యటనకు స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ తన అధికార దాహంతో ద్రోహపూరిత రాజకీయాలు చేస్తోందని, డీఎంకే సైతం వారిని అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన అనేది ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రక్రియ అని, దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్ల కోసం దానిని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి అనడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు. 2029 నాటికి తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు.






