- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ ఆవరణలో డీకే అరుణ కీలక వ్యాఖ్యలు.. గ్రామాలకు రూ. 10 లక్షల హామీ!
పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎక్స్ వేదికగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రజలందరూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రానికి మద్దతుగా నిలబడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రూపాయి నిధులు గ్రామాలకు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో గ్రామాభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బీజేపీ మద్దతుదారులకు ప్రజల మద్దతు కోరారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఆయా గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, సర్పంచ్ లుగా బీజేపీ మద్దతుదారులను గెలిపించిన గ్రామాలకు, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు అభివృద్ధికి అందజేస్తానని హామీ ఇచ్చారు. వీడియో ఇదే..






