Arvind Dharmapuri: పార్టీ ఈవెంట్‌కు హాజరుకాలేను.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-07-01 08:00:22  IST  )

తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు‌ ఎన్నిక ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.

Arvind Dharmapuri: పార్టీ ఈవెంట్‌కు హాజరుకాలేను.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana BJP) తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు‌ (Former MLC Ramachandra Rao) ఎన్నిక ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఇవాళ అధ్యక్షుడి నియామక కార్యక్రమం నిర్వహించనున్నారు. నూతన సారథిగా రామచందర్ రావును నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) సంచలన ట్వీట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేను అంటూ ఎక్స్ (X) వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అధ్యక్ష పదవి కోసమే అలిగినట్లు బీజేపీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. నిన్న కీలక నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

రాజాసింగ్ దారిలోనే.. పార్టీ అధ్యక్ష పదవి ఆశించిన ఎంపీ అరవింద్ కూడా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారేమోనని పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ‘అన్నా నువ్వు కూడా పార్టీకి సడెన్ షాక్ ఇవ్వకు’ అని ఆయన అభిమానులు ట్వీట్‌కు కామెంట్ పెట్టారు. ‘ఇది పద్దతి కాదు.. రామా చంద్ర రావు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి చాలా సౌమ్యమైన మనస్తత్వం. బీజేపీకి అధిష్టానం నిర్ణయమే అంతిమం’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘డమ్మీ వ్యక్తిని అధ్యక్షుడిని చేసి తప్పు చేశారు.. పార్టీ కోసమే ఏ మాత్రం స్వార్థం లేకుండా పనిచేస్తున మా లాంటి కార్యకర్తలకు తీవ్ర మనో వేదన మిగిల్చారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ మేరకు చాలా మంది అభిమానులు ధర్మపురి అరవింద్‌కు ఎక్స్ వేదికగా మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాగా, పార్టీ అధ్యక్షుడిగా రామచందర్ రావు‌ పేరును నిన్న అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో నిన్న అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా.. సపోర్ట్ చేస్తా అని స్పష్టం చేశారు.

Next Story
null