- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుంట్ల కవిత పార్టీకి రేవంత్ రెడ్డే స్పాన్సర్: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల పూర్తి మద్దతుతో బీజేపీ బలోపేతం అవుతోందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
సంజయ్ ఎక్కడుంటే అక్కడ శని..
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "సంజయ్ ఎక్కడుంటే అక్కడ శని ఉంటుంది" అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు డాక్టర్ శ్రావణిని పార్టీ నుండి పంపించారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ఈ విషయంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి తొందరపడుతున్నారని అర్వింద్ అభిప్రాయపడ్డారు. సంజయ్ మళ్ళీ కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఖాయమని, ఆయన వెళ్లే వరకు అక్కడ ప్రశాంతత ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో నాయకుల వలసలు, అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే ప్రజలు విసిగిపోతున్నారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు.






