- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ శాఖ చూసినా సమస్యలే: ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య స్పష్టత లేకుండా గందరగోళంగా ఉందని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య స్పష్టత లేకుండా గందరగోళంగా ఉందని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలకు నిరసనగా ఈనెల 23న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడుతామని, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. తాము పలుమార్లు 15 శాతం కేటాయించాలని డిమాండ్ చేసి , కేవలం 8 శాతం కేటాయింపులు చేయడం దారుణంగా ఉందన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 14 శాతం నుంచి 18 శాతం వరకు కేటాయింపులు ఉంటాయని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి ముఖ్య రంగాల్లో రేవంత్ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడాన్ని గొప్పగా చెప్పుకుంటోంది. మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేక, సరైన సమన్వయం లేక అనేక పథకాలు నిలిచిపోతున్నాయి. సోలార్ పంపుల వంటి పథకాలలో కూడా రాష్ట్రం వెనుకబడింది. విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖను చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. పేదలకు ఇండ్ల నిర్మాణం నుంచి రైతుల సమస్యల వరకు ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






