కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్

by Muthe.Rajitha |

నిన్న మొన్న ముఖ్య మంత్రి మంత్రులంతా ఏం చేశారని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, అసెంబ్లీ సమావేశంలో బీసీ ఘణన పై చర్చ అని అసెంబ్లీకి వస్తే రెండు నిమిషాలలో మధ్యాహ్నానికి సభ వాయిదా వేయడం పై బీజేపి ఎమెల్యేలు మండి పడ్డారు.

కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్న మొన్న ముఖ్య మంత్రి మంత్రులంతా ఏం చేశారని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, అసెంబ్లీ సమావేశంలో బీసీ ఘణన పై చర్చ అని అసెంబ్లీకి వస్తే రెండు నిమిషాలలో మధ్యాహ్నానికి సభ వాయిదా వేయడం పై బీజేపి ఎమెల్యేలు మండి పడ్డారు. అసెంబ్లీ మీడియా వద్ద బీజెపి పార్టీకి చెందిన అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. ఆయనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమాణారెడ్డి, అర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన చూస్తుంటే వీరికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. క్యాబినెట్ సమావేశం అసెంబ్లీ ఉన్నారోజే ఎందుకు నిర్వహించారని మండి మడ్డారు. ప్రాధాన్యత గల అంశాలపై సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు అసెంబ్లీలో సమస్యలు చర్చించేందుకు వచ్చామని తెలిపారు. అదిలాబాద్ నుంచి ఉదయం నాలుగు గంటలకు లేచి బయలు దేరి వస్తే అసెంబ్లీ వాయిదా వేశారని మండి పడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమస్యలు పరిష్కారం చేసేవిధంగా కనిపించడంలేదని అన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని విమర్శించారు.

Next Story