- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అసెంబ్లీలో గందరగోళం.. కూనంనేనిపై BJP ఎమ్మెల్యేలు ఫైర్
ప్రధాని నరేంద్ర మోడీ పోకడ బాగోలేదని.. ఆయన మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అని కూనంనేని మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో గందరగోళం చోటుచేసుకుంది. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పోకడ బాగోలేదని.. ఆయన మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అని కూనంనేని మాట్లాడారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేశారు.
గొప్పలకు పోతే తిప్పలు తప్పవు
అంతకుముందు కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించడం, అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని అన్నారు. వికేంద్రీకరణలో జాగ్రత్త వహించాలని, పరిపాలన సామర్థ్యాన్ని సరిచూసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ మహానగరంగా మారాలని గొప్పలకు పోతే తిప్పలు తప్పవన్నారు. మౌలిక సమస్యలు ఎలా పరిష్కరించాలన్న దానిపై ఆలోచన చేయాలని చెప్పారు. వర్షాకాలంలో చిన్న వర్షాలకే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్ అవుతుందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాలుష్య, డ్రైనేజీ, రోడ్డు వంటి అంశాలపై మేధావులతో చర్చించాలని చెప్పారు.






