- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ అదే మాట.. బీఆర్ఎస్ పార్టీ విలీనం తప్పదంటున్న ఎమ్మెల్యే!
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలువడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోస్యం చెప్పారు.

కుటుంబ కలహాలే పార్టీ విలీనానికి కారణం
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలువడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికి ప్రస్తుతం పరిస్థితులు బాగాలేక ఆ పార్టీ కాంగ్రెస్‌లో వీలినమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావాల్సిన ఉన్నా.. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వార్త కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఒరేయ్.. వెర్రి కామెడీ నాయాలా..? ఆ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫుల్ ఫైర్
సామాజిక మాధ్యమాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం అడ్డమైన కంటెంట్‌తో చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్‌తో ఓ యువకుడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా? అంటూ ప్రశ్నించారు. సజ్జనార్ ఇంకా ఏమన్నారు? ఆ వీడియోలో ఏముందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
మండు వేసవిలో కొంపలు మునిగే వర్షం.. ప్రజాశక్తి, సీపీఐ కాలనీలే టార్గెట్
అనంతపురంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. ప్రజాశక్తి కాలనీ, సీపీఐ కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తింది. మోకాళ్ల లోతులో నీరు నిలిచి పోవడంతో ఇళ్లలోంచి బయటకు రాలేక పలు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్ష బీభత్సం గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే..
ఆయనకో పదవి.. ఈయనకో పదవి.. నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం సన్నద్ధం
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం దామాషా ప్రచారం మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ పదవులను ఇస్తోంది. ఇప్పటికే 22 మందిని వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమించింది. కొద్దిరోజులు కిందట 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ఇక పార్టీ కోసం కష్టపడిన తెలుగు యువత, సోషల్‌మీడియా యాక్టవిస్టులకు మిగిలిన నామినేటెడ్‌పోస్టులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు యువత, సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు కూడా దృష్టిపెట్టనట్లు సమాచారం. కొద్ది రోజుల్లో మిగిలిన నామినేట్ పదవులు భర్తీ చేయనున్నారు. అయితే ఎవరెవరు పదవులు దక్కించుకుంటారు? అధిష్టానం ఎవరికి పట్టం పడుతుందో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






