- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HILT స్కాంను ఆధారాలతో నిరూపిస్తా.. లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బీజేపీ ఎమ్మెల్యే
గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం జరుగుతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం (Huge land scam) జరుగుతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ ఈ భూ కుంభకోణానికి తెరలేపిందని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Yeleti Maheshwar Reddy) స్పందిస్తూ సంచలన సవాల్ విసిరారు. HILT స్కాంను సాక్ష్యాధారాలతో నిరూపించగలను.
ఒకవేళ నేను నిరూపించలేకపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటా" అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్‌కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని తాను HILT స్కాంను నిరూపిస్తే.. మంత్రి ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో అసెంబ్లీలో కూర్చుంటానని సవాల్ విసిరారు. HILT స్కాం (HILT scam)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన సాక్ష్యాలను తాను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కాంపై విచారణకు నియమించిన సబ్ కమిటీ మంత్రులు అందరితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి రావాలని, అక్కడ తాను ఇచ్చే ఆధారాలను ఎదుర్కోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ HILT స్కాం అంశం కేవలం ఆరోపణల స్థాయిని దాటి, ఇప్పుడు రాజకీయ నాయకుల పరువు పందెంగా మారింది. ఈ సవాల్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించి, అసెంబ్లీలో చర్చకు సిద్ధపడతారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠను పెంచుతోంది.






