- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల కోసం ఓటర్ల లిస్టు తారుమారు: బీజేపీ లీగల్‌సెల్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనేక చోట్ల ఓటర్ లిస్టులు తారుమారు చేయడం, ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ లీగల్‌సెల్ ఆరోపించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనేక చోట్ల ఓటర్ లిస్టులు తారుమారు చేయడం, ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ లీగల్‌సెల్ ఆరోపించింది. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఓట్లు పెంచారు. ఇప్పటికే బిజెపి లీగల్ సెల్ ఇప్పటికే జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ వ్యతిరేకంగా, ప్రజల అభ్యంతరాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అదేవిధంగా రేపు మున్సిపాలిటీల్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, ఓటర్ లిస్టులో జరుగుతున్న అవకతవకలపై పోరాటం కొనసాగించాలని పేర్కొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మాత్రం డబ్బు, మత రాజకీయాల ఆధారంగా మాత్రమే గెలవాలనుకుంటున్నాయి. అందుకే బిజెపి లీగల్ సెల్ 24 గంటలు ప్రజాసేవ, న్యాయం, హక్కుల రక్షణలో నిమగ్నమై ఉంటుంది. ప్రజలకు న్యాయం జరిగేలా లీగల్ సెల్ నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాష్ర్ట ప్రజలు సోమనాథ్ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్–2026 సందర్భంగా శనివారం పంజగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటనలో పేర్కొంటూ సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవాలయాన్ని రక్షించేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలను స్మరించుకోవడానికే ఈ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతోందని తెలిపారు. ఆ మహనీయుల త్యాగాలు రాబోయే తరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.






