- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ అభ్యర్థి వైపు బీజేపీ మొగ్గు..! అనూహ్యంగా తెరపైకి విక్రమ్ గౌడ్ పేరు
జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్తనయుడు విక్రమ్గౌడ్పేరు తెర మీదికి వచ్చింది. ఆయన పార్టీ సీనియర్లతో టచ్‌లో ఉన్నట్ల పార్టీ కార్యాలయంలో టాక్వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ టికెటు కోసం ప్రయత్నాలు చేశారు. అధికార కాంగ్రెస్బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఫెయిల్అయితే ఉప ఎన్నికల్లో బీసీలకే టికెట్లు ఇచ్చామనే ప్రచారం చేసుకునేందుకు నవీన్‌యాదవ్‌కు ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉందనే విమర్శలకు చెక్‌పెట్టేందుకు కమల నాథులు కూడా బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ కూడా బీసీలకు వ్యతిరేకమని, అగ్ర వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చిందని, తామే నిజమైన వాదం ఎత్తుకున్నట్లు ప్రజలకు వినిపించేందుకు బీసీ నాయకుని ఉప పోరులో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ సీనియర్లు తెలిపారు. ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన లంకాల దీపక్‌రెడ్డి పరిస్థితి ఏమిటని శ్రేణులు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తూ ప్రజలు మధ్య ఉంటూ మోడీ పథకాలను వివరిస్తూ తెలంగాణ అభివృద్ది బీజేపీతో సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయనే అభ్యర్దిగా నియోజకవర్గం నేతలంతా భావించారు. తాజాగా విక్రమ్గౌడ్పేరు వినిపిస్తుండటంతో పార్టీ కోసం పని చేసిన నేతలను మోసం చేయడం తగదని కేడర్సూచిస్తుంది.






