అంజన్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..హైదరాబాద్‌లో నిరసనలు

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ నేత‌, మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

అంజన్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..హైదరాబాద్‌లో నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత‌, మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ కిషన్ రెడ్డిపై బూతులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా హైాదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన దిష్ఠిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబర్‌పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ దిష్ఠి బొమ్మను దహనం చేసి, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బీజేపీ నేతలు మాత్రమే కాకుండా అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను ఇతర పార్టీల నేతలు సైతం ఖండిస్తున్నారు.

Next Story