- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలపై కమల నాథులు కసరత్తు
రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై ఇప్పటి నుంచే కమలనాథులు ప్లాన్చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై ఇప్పటి నుంచే కమలనాథులు ప్లాన్చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలవడంతో పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. ఇదే ఊపుతో మున్సిపాలిటీలో విజయకేతనం ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు పాల్గొనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తో పాటు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ అభయ్‌పాటిల్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్తివారీ హాజరు కానున్నారు.
గొడవలతో సతమతం
ఇటీవల నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుల మధ్య చోటుచేసుకున్న గొడవ ఘటనపై కూడా ఆరా తీయనున్నట్లు తెలిసింది. నేతల మధ్య సమన్వయం లేకపోతే కార్యకర్తలకు పార్టీపై భరోసా తగ్గుతుందని సీనియర్లు భావిస్తున్నారు. అదేజిల్లాకు చెందిన అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, మరో నేత పిల్లి రామరాజును కూర్చోబెట్టి బుజ్జగించి ఒక్కటి చేసేందుకు ప్లాన్చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ బీసీ వాదంతో ముందుకెళ్లి అధికారం చేపట్టేందుకు రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమయంలో బీసీ నేతలపై దాడులు చేస్తే ఆ వర్గాల ప్రజలు దూరమవుతారని, ఆ పరిస్థితిని చక్క దిద్దుకోవడానికి పార్టీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నుంచి నాయకుల మధ్య సమస్యలు ఉంటే హైకమాండ్వద్ద చర్చించాలే తప్ప రచ్చ ఎక్కువ కావొద్దనే సందేశం, హెచ్చరికలను పంపించనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది.






