మోడీ కోసం బీజేపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు: ఆది శ్రీనివాస్

by Prasad Jukanti |

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఖరిని తప్పుబట్టారు.

మోడీ కోసం బీజేపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు: ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగానే మ‌హిళ బిల్లును నియెజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో క‌లిపుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభజన, మ‌హిళ బిల్లును ఓకే సారి పార్లమెంట్‍లో ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారన్నారు. మ‌హిళా బిల్లును తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్నప్పటికీ ఎన్డీఎ ప్రభుత్వం పట్టించుకోలేదని, 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసి ఉంటే బాగుండేదని ఇవా సీఎల్పీ మీడియా సెంటర్ లో మాట్లాడిన ఆయన.. యూపీఎ హ‌యాంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును రాజ్యసభ ఆమోదించిందని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారని గుర్తు చేశారు.

నష్టం జరగదని బీజేపీ వివరించాలి:

2026 జ‌నాభా లెక్కల ప్రకారం చేయకుండా ముందే ఎందుకు హ‌డావుడి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ద‌క్షణాది రాష్ట్రాల‌కు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో అన్యాయం జ‌ర‌గ‌కుండా సీఎం హైబ్రీడ్ ఫార్ములా సూచించారని ఈ ఫార్ములా రాష్ట్రాల్లో స‌మ‌స్యగా మార‌దన్నారు. ఈ మోడల్ ఫార్ములాపై ప్రధాని మోడీకి, దక్షిణాది రాష్ట్రాలకు కూడా సీఎం లేఖలు రాశారన్నారు. కాని బీజేపీ నాయ‌కులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిడ్డారు. కిష‌న్‍రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఏ మాత్రం స్పృహలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాభై శాతం సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం జరుగుతుందో సీఎం లెక్కలతో సహా వివరించారన్నారు. ఎలా న‌ష్టం జ‌ర‌గ‌దో బీజేపీ నాయ‌కులు ప్రజలకు వివరించాలన్నారు.

కిషన్ రెడ్డి ఫస్ట్, బండి సంజయ్ సెకండ్:

జరగుతున్న నష్టాన్ని వివరించడం మానేసి రాజ‌కీయ విమర్శలు చేయడం దారుణం అన్నారు. చేత‌నైతే మద్దతు ఇవ్వాలి లేదా మౌనంగా ఉండాలని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయ‌కుల తీరు ఇలానే ఉంటుందని, ఇష్టానుసారంగా చేస్తుంటే మేం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వడం కూడా తప్పా అని ప్రశ్నించారు. బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, దేశాన్ని రాజ‌కీయంగా క‌బ‌లించాల‌నే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీలో తెలివి త‌క్కువ నాయ‌కుల్లో కిష‌న్ రెడ్డి మొద‌టి వాడైతే, బండి సంజ‌య్ రెండో వాడని ఎద్దేవా చేశారు. మోడీ కోసం బీజేపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. వివ‌క్ష వల్లనే గ‌తంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని కేంద్రం తీరు వల్ల భవిష్యత్ లో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉందన్నారు.

కేసీఆర్ నోరు విప్పడం లేదెందుకు?:

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. గ‌తంలో దేశ్ కీ నేత‌గా కేసీఆర్ చెప్పుకున్నాడు.. ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదన్నారు. న‌రేంద్ర మోడీకి భ‌య‌ప‌డి మాట్లాడ‌టం లేదా? లేదా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న భావ‌న క‌లుగుతుందన్నారు. డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ పార్టీ స్పష్టంమైన వైఖరి చెప్పాలన్నారు.

Next Story