మీ సర్వేను నమ్మేదెలా..? పీసీసీ సర్వేపై విజయశాంతి సెటైర్లు

by Satheesh |   (  Updated:2023-06-19 07:28:54  IST  )

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయని పీసీసీ చేపట్టిన సర్వేపై బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు.

మీ సర్వేను నమ్మేదెలా..? పీసీసీ సర్వేపై విజయశాంతి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయని పీసీసీ చేపట్టిన సర్వేపై బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చెబుతున్న సర్వే ఫలితాలను ప్రజలు నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలవబోయే ఆ సీట్లు ఏవో కూడా పీసీసీ ప్రకటిస్తే ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందన్నారు. లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఈ సర్వే అసమంజసమైనదిగా ప్రజలు అనుకునే అవకాకాశం ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా ఇటీవల మీడియా చిట్ చాట్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పీసీసీ సర్వే చేసిందని దాని ప్రకారం బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధిస్తాయని మిగిలిన 15 సీట్లులలో తీవ్రమైన పోటీ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి పెరిగిపోయింది. దీంతో గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా రాజకీయం మారింది. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ కాన్ఫిడెంట్‌గా ఉంటే కారు పార్టీ స్పీడుకు బ్రేకులు వేసి అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, బీజేపీలు ధీమాతో ఉన్నాయి.

Next Story