దాసోజు అడుగుపెడితే పార్టీ పని ఖతం: విజయ్

by Disha Web |
దాసోజు అడుగుపెడితే పార్టీ పని ఖతం: విజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాసోజు శ్రవణ్‌ది ఒక ఐరన్ లెగ్ అని బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఆయన బీజేపీ నుంచి టీఆర్ఎస్‌కు మారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రంగులు మార్చే ఊసరవెల్లికి సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయని తీవ్రంగా విమర్శించారు. శ్రవణ్ తొలుత ప్రజారాజ్యంలో ఉన్నాడని, అనంతరం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. తాజాగా టీఆర్ఎస్‌లో చేరారన్నారు. దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికారంలోకి రాదని, అది చరిత్ర చెప్తున్న నగ్నసత్యమని, దానికి ఇదే నిదర్శనంగా చెప్పారు. ఏబీవీపీలో పనిచేసిన సమయంలోనూ ఆయన సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని మండిపడ్డారు. అది తెలిసి సంస్థ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. అక్కడి నుంచే ఆ వెన్నుపోటు రాజకీయాలు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. దాసోజు సత్యం కంప్యూటర్స్‌లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేశాడని, ప్రఖ్యాతిగాంచిన సత్యం కంప్యూటర్స్ కూడా కుప్పకూలిందన్నారు. దాసోజు శని గ్రహం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఆయన మారేందుకు ఉన్న పార్టీలు బీఎస్పీ, వైఎస్సార్ టీపీ, ఎంఐఎంలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎద్దేవాచేశారు.


Next Story