- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బజరంగ్ దళ్‌పై కాంగ్రెస్ విషం కక్కుతోంది: ప్రకాశ్ రెడ్డి ఫైర్
by Satheesh |
పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ ఒకటేననే ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా అని బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ ఒకటేననే ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా అని బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. బజరంగ్ దళ్ నిషేధం దుర్మార్గపు ఆలోచన అని మండిపడ్డారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే సంస్థలపై కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. బజరంగ్ దళ్ వల్ల మత ఘర్షణలు జరిగిన సంఘటన ఒక్కటైనా చెప్పగలరా ప్రశ్నించారు. పీఎఫ్ఐ చేసిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. అలాంటి పీఎఫ్‌ఐతో బలరంగ్ దళ్‌ని పోల్చడం సరికాదన్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా అది ఆర్ఎస్ఎస్ చేసిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని గుళ్లు కట్టించినా ప్రజలు నమ్మరని ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story






