- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరి గోల్డ్ ఫైనాన్స్ పేరుతో మోసం.. స్పందించిన బీజేపీ నేత
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, మరో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, మరో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. సిరి గోల్డ్ ఫైనాన్స్ పేరుతో బంగారం ఇస్తామని వేల మంది నుండి ఒక్కొక్కరి వద్ద రూ.15తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు అందింది. అయితే ఈ కేసుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ స్పందించారు. 30ఏళ్ల అనుభవంతో సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను నిర్వహిస్తున్నామని అన్నారు.
తన మిత్రుడు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుకు తన సంస్థతో సంబంధం లేదని చెప్పారు. కానీ ఆయనపై, తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. రూ.15వేలతో బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి డిపాజిట్ చేసినట్టు సీసీఎస్ పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఇది రాజకీయంగా చేస్తున్న కుట్రమాత్రమేనని చెప్పారు. ఇందులో వ్యాపార, రాజకీయ కుట్రలు ఉన్నాయన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనపై తన మిత్రుడిపై చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపాడు.






