ఈటల రాజేందర్ ఫెయిల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఈటల రాజేందర్ ఫెయిల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు నిర్వర్తించడంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫెయిలయ్యారని బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆయన ఈ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి లీడర్లు వస్తే బీజేపీకి మరింత బలం వస్తుందని భావించామని, కానీ వారిని చేర్చుకోవడంలో ఈటల రాజేందర్ ఫెయిల్ అయ్యారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా కర్ణాటక ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ 3వ స్థానంలో ఉందని బాంబ్‌ పేల్చారు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తే.. బీజేపీ పార్టీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు.

Next Story